← Back to news

దిశా సాలియాన్ డెత్ కేసులో CBI ఎంట్రీ

By Krishna· 53m ago
దిశా సాలియాన్ డెత్ కేసులో CBI ఎంట్రీ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా కేసులోకి CBI ఎంట్రీ ఇచ్చింది. FIR నమోదు చేసింది. 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్‌లో ఆమె భవనం నుంచి పడి మరణించారు. ముంబై పోలీసులు దీన్ని ఆత్మహత్యగా భావించి FIR రాయలేదు. ఈ కేసును సెప్టెంబర్ 2న బాంబే హైకోర్టు విచారించింది. దర్యాప్తు సరిగా లేదని భావించింది. "ఆరేళ్లుగా FIR రాయకపోవడం తప్పు" అంటూ CBIకి అప్పగించింది. ఆదిత్య థాకరే, సూరజ్ పంచోలి, డినో మోరియా తదితరులు ఆమెను గ్యాంగ్ రేప్ చేసి, చంపేశారని దిశ తండ్రి సతీష్ ఆరోపించారు. నిజాన్ని CBI తేల్చాల్సి ఉంది.

More in Entertainment