← Back to news

రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం: మల్లారెడ్డి

By dk· 15 Aug 2026· మేడ్చల్ జిల్లా
రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం: మల్లారెడ్డి

TG: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేట రైతుల భూముల విషయంలో BRS నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామానికి చెందిన 1,049 ఎకరాల భూములను 22ఏ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ రైతులు నిర్వహించిన మహాధర్నాలో మేడ్చల్‌ MLA మల్లారెడ్డి, BRS‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఒక్క గుంట భూమిని కూడా పోనివ్వబోమని హెచ్చరించారు. దశాబ్దాలుగా రైతులు సాగుచేస్తున్న భూములను 22ఏలో ఎలా చేర్చారని ప్రశ్నించారు.

More in Local