కరెంట్ షాక్‌తో చిన్నారి మృతి

AP: కరెంట్ షాక్‌తో ఓ చిన్నారి చనిపోయింది. విజయవాడ జక్కంపూడి వైఎస్సాఆర్ కాలనీకి చెందిన ఏసుబాబు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె మాధవి (5) కాలనీలోని ఖాళీ ప్రదేశంలో ఆడుకుంటుంది. అక్కడే ఓపెన్ చేసి ఉన్న కరెంట్ మీటర్ బాక్స్‌లను పట్టుకోవడంతో కరెంట్ షాక్‌తో బాలిక చనిపోయింది. గమనించిన స్థానికులు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ తెలిపారు.


