← Back to news

ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించాలి

By Narender Rampelly· 20 Aug 2026
ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించాలి

TG: నిర్మల్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన SIR ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ భవిష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి అంశాన్ని సమగ్రంగా ధ్రువీకరించాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇంకా మ్యాపింగ్‌ కాని ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా పరిశీలించాలని తెలిపారు. నిర్ణీత కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, ఓటర్ల వివరాల్లో తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు.

More in Local