CJPకి కొత్త సవాల్
అక్టోబర్ 2న ముంబైలోని శివాజీ పార్క్‌లో CJP చేపట్టాలనుకుంటున్న ‘జైల్ భరో’ ఆందోళనపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలంటూ CJP ఈ ప్రొటెస్ట్ చేస్తోంది. 2013 బాంబే హైకోర్టు ఉత్తర్వు ప్రకారం శివాజీ స్టేడియం స్పోర్ట్స్‌కే పరిమితం. ఆందోళనకి ముంబై పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. స్థానికులు, CJP కార్యకర్తల మధ్య జరిగిన చర్చలు, వాదనల వీడియో వైరల్ అయ్యింది. మరి ఆందోళన అక్కడే నిర్వహిస్తారా, లొకేషన్ మార్చుతారా అనేది సస్పెన్స్‌గా మారింది.
