← Back to news

మిలాద్-ఉన్-నబీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

By Ramu· 25 Aug 2026· Kamareddy
మిలాద్-ఉన్-నబీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

TG: ఈ నెల 26న మిలాద్‌-ఉన్‌-నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎస్‌డీపీవో శాంతి కమిటీ సభ్యులతో పండుగ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై చర్చించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. మత సామరస్యాన్ని కాపాడుతూ పండుగను సంతోషంగా నిర్వహించాలని కోరారు.

More in Local