తల్లి, బిడ్డల రక్షణకు ప్రత్యేక చర్యలు

TG : గర్భిణులు, బాలింతలు, పసిపిల్లల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు చెప్పారు. ఇవాళ కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘అంకురం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆడవారికి గర్భధారణ నుంచి ప్రసవం అయ్యే వరకు ఆరోగ్య తనిఖీలు చేయాలని, ఆరోగ్య సమస్యలు ఉన్న గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు.



