← Back to news

ధవళేశ్వరం వద్ద రెడ్ అలర్ట్

By DK· 2 Aug 2026· తూర్పుగోదావరి జిల్లా
ధవళేశ్వరం వద్ద రెడ్ అలర్ట్

AP: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం స్వల్పంగా తగ్గి 54.3 అడుగులకు చేరినా, ఆ వరద నీరు దిగువకు చేరుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజి వద్ద 13.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో నమోదైంది. ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాజ్‌వేలు దాటవద్దని హెచ్చరించారు.

More in AP