← Back to news

400 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

By DK FOCUS· 1d ago· Medchal (Ct), Medchal, Medchal Malkajgiri
400 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

TG: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట నుంచి సిద్దిపేటకు అక్రమంగా తరలిస్తున్న 400 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. నిఘా ఏర్పాటు చేసిన అధికారులు డీసీఎంను వెంబడించి సిద్దిపేటలోని మహాలక్ష్మి రైస్‌మిల్‌ వద్ద అడ్డుకున్నారు. తనిఖీల్లో వాహనంలో 120 క్వింటాళ్ల బియ్యం లభించగా, మిల్‌ పరిసరాల్లో మరో 280 క్వింటాళ్లు గుర్తించారు. డ్రైవర్‌ శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీసులకు అప్పగించారు. రైస్‌మిల్‌ యజమాని నాగరాజును విచారణ చేపట్టారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.