← Back to news

నాగర్కర్నూల్‌కి కొత్త డీఈ..

By Srinivas· 2d ago
నాగర్కర్నూల్‌కి కొత్త డీఈ..

నాగర్కర్నూల్ జిల్లా విద్యుత్ శాఖకు కొత్త డివిజనల్ ఇంజనీర్ వచ్చేశారు. DE ఎం.సుధాకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన హైదరాబాద్ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. 327 యూనియన్ నాయకులు ఆయన ఛాంబర్‌లో కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి కంగ్రాట్స్ చెప్పారు. యూనియన్ నాయకులు లక్ష్మయ్య, నిరంజన్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు ఆయన్ను కలిసిన వారిలో ఉన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 7h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.