← Back to news

బోర్ వాటర్ తాగుతున్నారా.. జాగ్రత్త

By Sharmila· 6 Oct 2026
బోర్ వాటర్ తాగుతున్నారా.. జాగ్రత్త

TG:హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమైనట్లు తాజా రీసెర్చ్ లో తేలింది. 36 ప్రాంతాల్లో బోరు వాటర్ తాగేందుకు అనుకూలంగా లేదని గుర్తించారు. ఉప్పల్, కూకట్‌పల్లి, బాలానగర్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో నైట్రేట్, ఫ్లోరైడ్ స్థాయిలు అధికంగా ఉన్నాయి. బోరు నీటిని నేరుగా తాగే ముందు నాణ్యత పరీక్షించుకోవాలని వాటర్‌బోర్డు సూచించింది. వాటర్‌బోర్డు సరఫరా చేసే నీటిని వాడడం మంచిదని వాటిని మూడు దశల్లో క్లోరినేషన్ చేస్తామని తెలిపారు.

More in TG