← Back to news

అర్ధరాత్రి కరెంట్ కట్.. నర్సంపేటలో ఆగ్రహం

By Ramesh Ch· 47m ago· Narsampet (Ct), Narsampet, Warangal
అర్ధరాత్రి కరెంట్ కట్.. నర్సంపేటలో ఆగ్రహం

TG: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో విద్యుత్ కోతలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి సుమారు గంటన్నరపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వృద్ధులు, చిన్నారులు దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందస్తు సమాచారం లేకుండా, నిర్ణీత సమయపాలన లేకుండా కోతలు విధించడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనవసర కోతలను నివారించాలని, అత్యవసర పరిస్థితుల్లో సరఫరా నిలిపివేస్తే ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులను స్థానికులు కోరారు.

More in Local