← Back to news

నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు

By Nani Garikina· 25 Aug 2026· Ndtv
నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు

భారీ వర్షంతో రోడ్లపై నీరు చేరడంతో గురుగ్రామ్‌లో స్కూల్ బస్సులు మధ్యలోనే ఆగిపోయాయి. ఒక బస్సులో పిల్లలు దాదాపు నాలుగు గంటల పాటు చిక్కుకుపోయారు. 👀 తల్లిదండ్రులు స్కూల్, అధికారులకు వరుసగా ఫోన్లు చేస్తుండగా.. నీరు ఎక్కువగా ఉండటంతో సాధారణ వాహనాలు అక్కడికి చేరలేకపోయాయి. చివరికి అధికారులు క్రేన్‌ను తీసుకొచ్చి బస్సును ముందుకు జరిపారు. ఆ తర్వాత పిల్లలను మరో బస్సులోకి మార్చి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 4h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.