కొన్ని క్షణాల్లోనే అంతా కొట్టుకుపోయింది!
నేపాల్–టిబెట్ సరిహద్దులో ఒక్కసారిగా మట్టి, రాళ్లు, నీటితో భారీ వరద దూసుకురావడంతో తీవ్ర నష్టం జరిగింది. నేపాల్‌లో ఇప్పటివరకు 95 మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు వందల మంది ఆచూకీ తెలియడం లేదు. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు వరదలో కొట్టుకుపోయాయి. కొండపై నుంచి భారీగా మట్టి, రాళ్లు నదిలోకి జారిపడటంతో ఈ వరద మొదలై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. దెబ్బతిన్న రోడ్ల కారణంగా కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది.



