జ్ఞానేష్‌కి ఇచ్చిన అవార్డు వెనక్కి తీసుకోవాలి: అశుతోష్ రాంకా

CJP కోకన్వీనర్, IIT కాన్పూర్ పూర్వ విద్యార్థి అశుతోష్ రాంకా తన ఎక్స్‌లో రాసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. CEC జ్ఞానేష్ కుమార్ IIT కాన్పూర్ పూర్వ విద్యార్థి అని, ఆ బ్రాండ్‌కే మచ్చ తెచ్చారని అశుతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆయన IIT కాన్పూర్ బ్రాండ్‌కే కళంకం. అలాంటి వ్యక్తికి గతేడాది ‘విశిష్ట పూర్వ విద్యార్థి’ అవార్డు ఇవ్వడం సిగ్గుచేటు. ఐఐటీ కాన్పూర్ యాజమాన్యం ఆయన నుంచి ఆ అవార్డును వెంటనే వెనక్కి తీసుకోవాలి’ అని రాశారు.