← Back to news

ఐదు పిల్లలకు జన్మనిచ్చిన ఆడ చిరుత

By Nani Eluri· 21h ago· X

కూనో నేషనల్ పార్క్‌లో గుడ్ న్యూస్. భారత్‌లోనే పుట్టిన 32 నెలల ఆడ చిరుత KJP21 ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఐదు కొత్త చిరుత పిల్లలు రావడంతో దేశంలో మొత్తం చిరుతలు 60కి చేరాయి. ఇందులో 41 చిరుతలు భారత్‌లోనే పుట్టాయి. ఈ ఐదు పిల్లల తండ్రి బోట్స్వానా నుంచి భారత్‌కు వచ్చిన చిరుత. కొత్తగా పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో కూనోలో చిరుతల కుటుంబం మరింత పెరిగింది. ఈ జననంతో ప్రాజెక్ట్ చిరుతకు మరింత ఉత్సాహం వచ్చింది.

More in Infotainment