ఆకాశవాణి భవన్‌లో బైఠాయించిన కాంగ్రెస్ నేతలు
CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో INDIA కూటమి ఎంపీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ నుంచి ECI ఆఫీసు వైపు ర్యాలీగా బయలుదేరిన ప్రతిపక్ష నేతలను పోలీసులు ఆకాశవాణి భవన్ దగ్గర అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, దీపేందర్ హుడా, ఇతర ముఖ్య నేతలు ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించి చెట్టు కింద బైఠాయించారు. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

