ఇక ATMలో ఇంద్రకీలాద్రి లడ్డు ప్రసాదం

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం లడ్డూ ప్రసాదం ఏటీఎం ఏర్పాటు చేశారు. ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ దీనిని స్టార్ట్ చేశారు. ఏటీఎం తరహాలో ఆప్షన్లు ఎంచుకుని లడ్డూ బాక్సులను తెసుకోవచ్చు. 100, 200, 300, 400 రూపాయలు బాక్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో బాక్సులో ఆరు లడ్డూలుంటాయి. భక్తులు క్యూలో ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రసాదం పొందేందుకు ఈ సదుపాయం ఉపయోగపడనుంది. ప్రసాదం పంపిణీలో టెక్నాలజీని యూజ్ చేయడం కొత్త అనుభూతిగా ఉందని భక్తులు చెబుతున్నారు.

