కొండపైకి పరిగెత్తిన జనాలు.. ఎందుకంటే ?

AP: కర్నూలు జిల్లా గోరుకల్లు గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి తెల్లవారుజామున రిజర్వాయర్‌లో గేటు ఎత్తాడు. దీంతో 3 వేల క్యూసెక్కులకు పైగా నీరు బయటకు వచ్చి ఎస్సార్బీసీ కాలువలోకి చేరింది. కాలువ కట్ట దెబ్బతినడంతో సమీప రోడ్లు, పొలాల్లోకి నీరు, బండరాళ్లు వచ్చాయి. ప్రమాదం భయంతో సుమారు వెయ్యి మంది గ్రామస్థులు కొండపైకి పరుగులు తీశారు. అధికారులు సూచించడంతో ఎలక్ట్రిషియన్ కోటయ్య గేటును మాన్యువల్‌గా క్లోస్ చేయడంతో ముప్పు తప్పింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

