'డేటా సెంటర్స్ వద్దు'.. మహాత్మునికి మనవి!

విశాఖలో కొంతకాలంగా AI డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా గ్రీన్ విశాఖ సంస్థ సభ్యులు, మద్దతుదారులూ.. మహాత్ముని విగ్రహానికి మౌన మనవి చేశారు. గాలి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలనీ, తాగు నీటి కొరత సమస్యను పరిష్కరించాలనీ, CRZ రూల్స్ కఠినంగా అమలు చెయ్యాలని వారు కోరారు. AI డేటా సెంటర్లు అతిగా నీటినీ, కరెంటునూ వాడతానీ, ఎయిర్ పొల్యూషన్ పెంచుతాయంటున్న ప్రొటెస్టర్లు వాటిని ఏర్పాటు చెయ్యవద్దని కోరుతున్నారు.




