← Back to news

ఫోన్ స్విచ్ఛాఫ్.. గ్యాస్ సిలిండర్, బట్టలు మాయం

By DK· 1h ago
ఫోన్ స్విచ్ఛాఫ్.. గ్యాస్ సిలిండర్, బట్టలు మాయం

TG రంగారెడ్డి జిల్లా మోకిలా PS పరిధిలో ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం బహదూర్‌పూర్ తండాకు చెందిన కుటుంబం రెండేళ్లుగా మోకిలాలో నివాసం ఉంటోంది. భర్త కారు డ్రైవింగ్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య, ముగ్గురు పిల్లలు కనిపించలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబసభ్యులు వారి కోసం గాలించారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్, బట్టలు కూడా కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వారి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.

More in Local