నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి నగదు వసూలు

AP: సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తిని బెదిరించి ₹ 87వేల నగదు వసూలు చేసిన ముగ్గురు నిందితులను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా నల్లపాడు PS పరిధిలో నమోదైన కేసులో CI భాస్కర్ ఆధ్వర్యంలో SI మధు పవన్, పోలీస్ సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. నిందితులు బాధితుడిని నిర్మానుష్య ప్రాంతానికి రమ్మని పిలిచి, ఫొటోలు, వీడియోలు తీసి వాటిని కుటుంబసభ్యులకు, సోషల్ మీడియాలో పెడతామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. రెండు బ్యాంకు అకౌంట్‌ల ద్వారా PhonePeతో ₹87వేలు బదిలీ చేయించుకున్నట్లు తెలిపారు.



