AI ఆయుధాలపై ప్రపంచ దేశాల మధ్య వివాదం!

AI ఆధారిత ఆయుధాలు.. యుద్ధంలో మనిషి నిర్ణయం లేకుండానే టార్గెట్ చేసి దాడి చేస్తే? ఇదే విషయంపై జెనీవాలో UN ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి. మనిషి ఆదేశం లేకుండానే టార్గెట్‌ను గుర్తించి దాడి చేసే ఆయుధాలకు నియమాలు పెట్టాలా అనేదే ప్రశ్న. 128 దేశాలు చర్చిస్తున్న డ్రాఫ్ట్‌కు అమెరికా, రష్యా మార్పులు సూచించడంతో.. ఒప్పందంపై స్పష్టత లేకుండా పోయింది. చాలా దేశాలు కఠినమైన నియమాలు కోరుతుండగా.. ఈ రెండు దేశాలు ప్రస్తుత మానవతా చట్టాలే సరిపోతాయని చెబుతున్నాయి. ప్రశ్న ఒక్కటే.. తుది నిర్ణయం మనిషి చేతిలోనే ఉండాలా?




