← Back to news

రోజుకు 7 వేలకుపైగా ట్యాంకర్ బుకింగ్స్‌

By A.Ajay· 1h ago
రోజుకు 7 వేలకుపైగా ట్యాంకర్ బుకింగ్స్‌

TG: హైదరాబాద్‌లో నీటి ట్యాంకర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. వర్షాలు తక్కువగా పడటం, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. సాధారణంగా వేసవిలో ఎక్కువగా ఉండే బుకింగ్స్‌ ఈసారి అక్టోబర్‌లోనూ పెరుగుతున్నాయి. దీంతో నీటి సరఫరాపై వాటర్‌ బోర్డుపై ఒత్తిడి పెరుగుతోంది. నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల ప్రజలు ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారు.

More in TG