‘దేశాన్ని ఎందుకు పాడుచేస్తున్నారు?’..దీప్కేకు చేదు అనుభవం
CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేకు ఢిల్లీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగిన ఆయనను కొందరు వ్యక్తులు నిలదీస్తూ "దేశాన్ని ఎందుకు పాడుచేస్తున్నారు?" అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంతర్మంతర్ దగ్గర జరగాల్సిన నిరసనలో పాల్గొనడానికి ఢిల్లీకి చేరుకున్న ఆయనను పోలీసులు అంతకుముందు విమానం లోపలే అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం.

