నేనూ మార్ఫింగ్ ఫొటోల బాధితురాలినే!

నటి శ్రియ 2001లో ‘ఇష్టం’ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన 25 ఏళ్ల సినీ ప్రయాణంతో పాటు AI టెక్నాలజీ గురించి మాట్లాడారు. కొందరు AIని ఉపయోగించి మహిళల ఫొటోలు, వీడియోలను అసభ్యంగా మార్చి వేధిస్తున్నారని చెప్పారు. తాను కూడా గతంలో ఇలాంటి మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల బాధితురాలినేనని వెల్లడించారు. AIని మంచి పనులకు ఉపయోగించాలి తప్ప, ఇతరులను బాధపెట్టేందుకు వాడకూడదని అన్నారు.

