← Back to news

నేపాల్ వరదల్లో 97 ఏళ్ల బామ్మ మిరాకిల్

By BK· 6d ago· Youtube· నేపాల్
నేపాల్ వరదల్లో 97 ఏళ్ల బామ్మ మిరాకిల్

రీసెంట్‌గా నేపాల్ వరదల్లో బురదలో ఇరుక్కుపోయిన ఓ బామ్మను JCB ద్వారా రెస్క్యూ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ బామ్మ పేరు 'గునా మాయా బోహరా', వయసు 97 ఏళ్లు. అంతటి భయంకరమైన జలప్రళయంలో చుట్టూ ఉన్నవాళ్లు ప్రాణాలు కోల్పోయినా, ఈ బామ్మ చావును గెలిచి ప్రాణాలతో బయటపడింది. ఆమెను కాపాడుకోవడానికి మనవడు దీపక్ కాట్మాండు నుంచి వచ్చి, 4 గంటల పాటు రెస్క్యూ టీమ్‌తో కలిసి బామ్మను సేఫ్‌గా బయటకు తీశారు. మనవడు మీడియాతో మాట్లాడుతూ "యుద్ధం గెలిచొచ్చిన రియల్ వారియర్ లా ఉంది మా బామ్మ" అని చెప్పాడు.

More in International