తాత మధు ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలి
TG: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై BRS ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని వరంగల్ జిల్లా నర్సంపేట దళిత కాంగ్రెస్ నేత బాణాల శ్రీనివాస్ అన్నారు. నర్సంపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని, SC, ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. BRS నేతలు దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



