← Back to news

KTR, హరీశ్‌రావు అరెస్ట్!

By Krishna· 42m ago· X

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కి వెళ్లేందుకు పాదయాత్రగా బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు KTR, హరీశ్‌రావును పోలీసులు.. హకీంపేట దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్‌ను బోయిన్‌పల్లి, హరీశ్‌రావును జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోని కేసీఆర్ ఇంటి దగ్గర చావు డప్పు కొడతామని కాంగ్రెస్ పిలుపిచ్చింది. దాంతో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా.. బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో.. అసెంబ్లీ నుంచి బయలుదేరిన కేటీఆర్, హరీశ్‌రావును అడ్డుకున్నట్లైంది.

More in TG