'పిల్ల జమిందార్' డైరెక్టర్‌పై కేసు!

టాలీవుడ్ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ EOWలో కేసు నమోదైంది. ఓ యువకుడిని హీరోగా పరిచయం చేస్తానంటూ అతని తల్లిదండ్రుల నుంచి రూ.3.5 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బులు తీసుకున్నా హీరోగా ఛాన్స్ ఇవ్వకపోగా, ఆ అమౌంట్ కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ భారీ ఫ్రాడ్‌పై కేసు ఫైల్ చేసిన పోలీసులు.. నిర్మాత విజయలక్ష్మి, డైరెక్టర్ అశోక్ బాబులను ప్రస్తుతం విచారిస్తున్నారు.



