← Back to news

11 నెలల పాపను నదిలోకి విసిరిన తండ్రి

By Mahesh· 15 Aug 2026· Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఆగ్రాలో దారుణ ఘటన జరిగింది. సికంద్రా దగ్గర్లోని రింకు అనే వ్యక్తి తన 11 నెలల పాపను యమునా నదిలోకి విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆగస్టు 17న పాప బర్త్ డే సందర్భంగా భార్య లక్ష్మితో కలిసి బట్టలు కొనడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అక్బరీ బ్రిడ్జ్ వద్ద పాపతో సెల్ఫీ తీసుకుంటానని చెప్పి నదిలోకి విసిరినట్లు తెలుస్తోంది. భార్యను కూడా నదిలోకి తోసేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుకోగా, పాప కోసం వెతుకుతున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 9h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.