ప్రభుత్వ భూముల్లో అక్రమాలకు చెక్!
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడులో ప్రభుత్వ భూముల్లో జామాయిల్ చెట్లు నరికి తరలిస్తున్నారనే సమాచారంపై అధికారులు విచారణ చేపట్టారు. గ్రామ పరిధిలో సుమారు 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించామని తహసీల్దార్ నాగరాజు తెలిపారు. అక్రమంగా చెట్లు నరికినా, భూములు ఆక్రమించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు.


