← Back to news

తిమ్మాపూర్ జట్టుకు క్రికెట్ లీగ్ టైటిల్!

By Pinjari Shiva Kumar· 1d ago· Jagitial
తిమ్మాపూర్ జట్టుకు క్రికెట్ లీగ్ టైటిల్!

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ లీగ్ ఫైనల్ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. తిమ్మాపూర్ జట్టు విజేతగా, వర్షకొండ జట్టు రన్నరప్‌గా నిలిచాయి. ఎస్సై జి. నవీన్ కుమార్ విజేతలకు ₹10 వేల నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు ₹5 వేల పురస్కారం అందజేశారు. క్రీడలు యువతలో శారీరక దృఢత్వం, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

More in Local