క్రూరత్వానికి కాస్త పాజ్ !!
చిరుతకు చెలగాటం..జింకకు ప్రాణ సంకటం. ఈ విజువల్ లో చిరుత తన క్రూరత్వానికి కాస్త పాజ్ ఇచ్చింది. విందు భోజనానికి ముందు స్టార్టర్ లాగా జింక పిల్లతో పరాచకాలాడింది.ఆ అమాయకపు జింక పిల్లకి పారిపోవడం కూడా రాదు..చిరుతతోనే ఆప్యాయత పంచుకుంది. ముద్దు ముచ్చట్లాడింది... దూరంనుంచి గమనిస్తున్న ఓ తోడేలు జింకను తినేందుకు పరుగు పరుగున రాగా చిరుత జింక ను నోటకరచి సమీపంలో ఉన్న చెట్టు మీదకి పారిపోయింది. జింక పని ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. కిందకి దిగితే తోడేలు.. పైనే ఉంటే చిరుత.. రెంటిలో దేనికి ఆహారంగా మారుతుందో మరి !! పాపం.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.



