← Back to news

యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

By Karimulla Shaik· 19 Aug 2026· Vinukonda R, Vinukonda, Palnadu
యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

AP: కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి విమర్శించింది. రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ కార్యదర్శి మరీబాబు మాట్లాడుతూ అత్యధిక యువజన జనాభా కలిగిన భారతదేశంలో ]నిరుద్యోగం, అస్థిర ఉపాధి, వలసలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదని ఆరోపించారు.

More in Local