నీ పిల్లివల్లే... మా పిల్లికి పిల్లలు

బెంగళూరులో పిల్లి పిల్లల కోసం ఇద్దరు యజమానులు గొడవపడటం హాట్‌టాపిక్‌గా మారింది. ఒకరి ఆడపిల్లికి నాలుగు పిల్లలు పుట్టగా, దానికి పక్క ఇంట్లోని మగపిల్లే కారణమని ఆ యజమాని గొడవకు దిగాడు. ఆ పిల్లలను మీరే పెంచాలంటూ వారి ఇంట్లో వదిలేశాడు. ఈ వింత గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. చివరకు పోలీసులు కలగచేసుకుని, ఇద్దరికీ రెండేసి పిల్లి పిల్లలను ఇచ్చి ఈ క్యాట్ వార్ ని సెటిల్ చేశారు.



