← Back to news

రాఘవాపూర్‌కు కొత్త రోడ్డు.. పనులు ప్రారంభం

By VGRAO· 13h ago· Peddapalli
రాఘవాపూర్‌కు కొత్త రోడ్డు.. పనులు ప్రారంభం

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గొల్లపల్లి గ్రామంలో ₹10 లక్షలతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శంకుస్థాపన చేశారు. స్థానిక నాయకులతో కలిసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

More in Local