← Back to news

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు

By DS· 19 Jul 2026· Hyderabad
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు

TG: హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఓ ట్రైనీ IPSను తోటి ట్రైనీ లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తూ బూతులు తిడుతున్నాడని ఓ మహిళా ఐపీఎస్ ట్రైనీ అత్తాపూర్ PSలో ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లయింట్ మేరకు అతడిపై కేసు నమోదైంది. తనను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాగే తనకు తెలియకుండా వ్యక్తిగత, ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించాడని ఆమె ఆరోపించారు.

More in TG