మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం? డ్రెయిన్లో పడిన బాలుడు!
హర్యానా రాష్ట్రం పానిపట్లో పెద్ద ప్రమాదం తప్పింది. దేవీ మందిర్ రోడ్డుపై వెళ్తున్న 8 ఏళ్ల బాలుడు మూతలేని డ్రెయిన్లో పడిపోయాడు. ఈ ఘటన CCTVలో రికార్డ్ అయింది. బాలుడు పడిపోవడం చూసిన స్థానికుడు వెంటనే రియాక్ట్ అయి ఆ బాలుడిని సేఫ్గా బయటకు తీశాడు. ఇదే ప్రాంతంలో గత నెలలో ఓ మహిళ కూడా డ్రెయిన్లో పడింది. వరుస ఘటనలతో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. ఓపెన్ డ్రెయిన్లకు సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

