CJP ప్రెస్మీట్.. రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ల గందరగోళం
ఢిల్లీ ప్రెస్ క్లబ్లో నిన్న CJP నిర్వహించిన ప్రెస్మీట్లో రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ల తీరు గందరగోళానికి, వాదోపవాదాలకు దారితీసింది. మీటింగ్ స్టార్ట్ అయిన వెంటనే రిపోర్టర్ పదేపదే CJP ప్రతినిధులను ప్రశ్నిస్తూ, వారి మాటలకు అడ్డుతగిలారు. దీనిపై అభిజీత్ దీప్కే, నేహా బోరా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ వాతావరణాన్ని పాడుచేసేలా, చర్చను పక్కదారి పట్టించేలా ఆ రిపోర్టర్లు ప్రవర్తించారని అన్నారు. చివరకు వాళ్లను అక్కడి నుంచి బయటకు పంపించారు.

