అస్సాంలో వరదల బీభత్సం... సహాయ చర్యలు ముమ్మరం

అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద పరిస్థితి తీవ్రంగా మారింది. దీని ప్రభావంతో సిమలుగురి ప్రాంతంలో రైల్వే ట్రాక్‌లు మునిగిపోవడంతో ఇండియన్ రైల్వే అక్కడ రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడమో, లేదా ఇతర మార్గాల్లోకి మళ్లించడమో చేశారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. రైల్వే శాఖ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు అప్‌డేట్లు అందిస్తోంది.



