63 ఏళ్లుగా పూజలందుకుంటున్న భోసి కర్ర వినాయకుడు

నిర్మల్ జిల్లా తానూరు మండలం భోసి గ్రామంలో కర్ర వినాయకుడు 63 ఏళ్లుగా పూజలందుకుంటున్నాడు. 1963లో రైతులు పర్యావరణ రక్షణ కోసం ఒకే కర్ర వినాయకుడిని తయారు చేయించారు. పదకొండు రోజులు పూజలందుకున్న ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయరు. వాగు నీళ్లు చల్లి బీరువాలో భద్రపరుస్తారు. గణపతి వేడుకలకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఊరిలో ప్రతి రైతు కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండటం గణేశుడి ఆశీర్వాదమేనని గ్రామస్థుల నమ్మకం. వావ్..నిమజ్జనమే లేని వినాయకుడు. ఇది అద్భుతం కదా!



