10 ఏళ్ల ‘పెళ్లిచూపులు’

విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ హిట్ సినిమా ‘పెళ్లిచూపులు’ (2016) ఈ రోజూ తో విజయవంతంగా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, విజయ్ దేవరకొండ తన 'x 'లో పోస్ట్ చేస్తూ, తన కెరీర్‌కు పునాది వేసిన ఈ సినిమా, దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాత రాజ్ కందుకూరి, టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రెండు (National Awards) జాతీయ అవార్డులు సాధించి టాలీవుడ్‌లో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిందని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.




