కల్లేరు గ్రామస్థుల డిమాండ్
చింతూరు మండలం కల్లేరు గ్రామం ఎదుర్కొంటున్న పోలవరం ముంపు సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బాధితులు డిమాండ్ చేశారు. ప్రతిసారి వచ్చే వరదలకు ఇళ్లు, పంటలు మునిగిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని, అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని వెంటనే 41.15 కాంటూర్ పరిధిలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారంతో పాటు భూమికి భూమి, R&R ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.



