ఎమ్మార్పీఎస్‌కు కొత్త నాయకత్వం.. అధ్యక్షుడిగా శామప్ప

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. బి. కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మండల అధ్యక్షుడిగా పోషమొల్ల శామప్ప మాదిగ, ఉపాధ్యక్షుడిగా పరశురాంను నియమించారు. ఎంఎస్‌పీ మండల అధ్యక్షుడిగా పోతురాజు భీమ్‌సప్ప, ఎంఎస్‌ఎఫ్ మండల అధ్యక్షుడిగా కొత్త మళ్లేశ్‌ను ఎన్నుకున్నారు.

