ఏపీలో కరోనా భయంతో తెలంగాణలో పరీక్షలు

TG: ఆంధ్రలో కొత్తగా 49 కోవిడ్ కేసులు రావడంతో తెలంగాణలో జనాలు అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని హాస్పిటల్ ల్లో కరోనా పరీక్షల గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ట్రావెల్ చేసి వచ్చినవాళ్లు, చిన్నపాటి అనారోగ్య లక్షణాలు ఉన్నవాళ్లు ఈ పరీక్షలకు వస్తున్నారు. అయితే, ఇప్పటివరకు చేసిన టెస్ట్ ల్లో ఎవరికీ పాజిటివ్ రాలేదని డాక్టర్లు చెప్పారు. జలుబు, జ్వరం, శ్వాస సమస్యలు ఉంటేనే పరీక్షలు చేసుకోవాలని అధికారులు తెలిపారు.



