← Back to news

ఉత్తరప్రదేశ్‌లో మరో Gen Alpha ఉద్యమం!

By BK· 18 Aug 2026· UP

ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లా స్మిత్ ఇంటర్ కాలేజీలో విద్యార్థులు నిరసనకు దిగారు. 'కెమిస్ట్రీ సార్ లేకపోతే మా భవిష్యత్తు ఆసిడ్‌లా మండిపోతుంది' అని రాసి ఉన్న ప్లకార్డులతో పాఠశాల ముందు ధర్నాకు కూర్చున్నారు. స్కూల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని, పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 8h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.