భువనగిరిలో ముఖ్య నేతల కీలక సమావేశం

TG: యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని న్యూ వివేర హోటల్‌లో కాంగ్రెస్ PAC (పొలిటికల్ ఎఫైర్ కమిటీ) కీలక సమావేశం నిర్వహించారు. యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు జిల్లాల్లో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై చర్చించారు.




