← Back to news

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం ఫైర్

By Moulali Moula· 18 Aug 2026· రంగారెడ్డి జిల్లా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం ఫైర్

TG: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీపీఎం మద్దతు తెలిపింది. హామీలు ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా ఖాళీ పోస్టులను భర్తీ చేసి యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసింది. శంషాబాద్‌లో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు బచ్చలకూర స్వామి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలు ఏమైందని ప్రశ్నించారు.

More in Local