← Back to news

ఇదేం సరదా? ఒక్క బైక్‌పై ఆరుగురు విద్యార్థులు!

By Lokesh· 4h ago

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో.. స్కూల్‌ యూనిఫామ్‌లో ఉన్న చాలా మంది విద్యార్థులు ఒకే బైక్‌పై వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో బైక్‌పై 5 నుంచి ఆరుగురు ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకరి భుజాలపై ఒకరు కూర్చున్నట్లు కనిపించారు. ఈ వీడియోపై మీరట్‌ పోలీసులు స్పందించి, చట్టపరమైన చర్యలు తిస్కుకుంటామని తెలిపారు. ఇలాంటి రైడ్స్‌ ప్రమాదకరమనీ, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని పోలీసులు సూచించారు.

More in Viral